Tamannaah : మాల్దీవులలో రచ్చ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. వీడియో వైరల్!

March 24, 2022 9:11 PM

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా సమ్మర్ వెకేషన్ ను ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులకు కాస్త విరామం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు వెళ్లి అక్కడ బీచ్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే పింక్ కలర్ బికినీ ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా మరో వీడియోని త‌మ‌న్నా షేర్ చేసింది.

Tamannaah eating burger in Maldives video viral
Tamannaah

మాల్దీవులలో ఎంతో ఎంజాయ్ చేస్తూ గ్లామ‌ర‌స్‌ ఫోటోలకు పోజులు ఇస్తున్న తమన్నా తాజాగా టూ పీస్ స్విమ్ సూట్ ధరించి బర్గర్ చేతబట్టి ఎంతో వయ్యారంగా నడుస్తూ ఉన్న ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఎంతో రుచికరమైన బర్గర్ చేతపట్టి ఆ బర్గర్ చూపిస్తూ ఉన్న వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే వెంక‌టేష్‌తో క‌లిసి ఈమె న‌టించిన ఎఫ్‌3 మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now