Belly Fat : హార్వార్డ్ మెడికల్ హెల్త్ చెబుతున్న దాని ప్రకారం.. నడుము, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఒకరకంగా హెచ్చరిక లాంటిది. వైద్య భాషలో ఈ అనారోగ్య కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. దీనివల్ల టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పొట్ట, తొడల చూట్టూ పేరుకుపోయే కొవ్వులను వ్యాయామం ద్వారా అంత సులభంగా కరిగించలేం. తొడ కొవ్వు కంటే, పొట్ట దగ్గరి కొవ్వుని కరిగించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. పొట్ట దగ్గరి కొవ్వు కణాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇవి అంత సులభంగా విచ్ఛిన్నం కావు. దీన్ని లిపోలిసిస్ అంటారు.
మారిన జీవనశైలితో ప్రస్తుతం అనేకమంది బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనిని తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఫలితం శూన్యం. బెల్లీఫ్యాట్ ని కరిగించడం అంత ఈజీ కాదు.. కానీ పరగడుపున ఒక జ్యూస్ తాగితే సులువుగా కరిగిపోతుంది. ఇందులోని పదార్థాలు కొవ్వుని కరిగించడానికి తోడ్పడతాయి. కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కొత్తిమీరను భారతీయ ఆహారంలో కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇది దాదాపు అందరి ఇళ్లలోనూ సాధారణంగా ఉంటుంది. కొత్తిమీరను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా ప్రసవం తర్వాత పొట్టలో పేరుకుపోయే కొవ్వుతో చాలామంది మహిళలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు కొత్తిమీర జ్యూస్ తాగవచ్చు. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జ్యుస్ కోసం ముందుగా మీరు కొత్తిమీర, సోంపు, జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి తర్వాత దానిని ఫిల్టర్ చేసి వేడి టీ మాదిరి తాగాలి. కావాలంటే అందులో బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ జ్యుస్ లో ఉండే కొత్తిమీర, జీలకర్ర, సోంపు పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…