Belly Fat : ప‌ర‌గ‌డుపునే దీన్ని 15 రోజుల పాటు తాగండి.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

August 29, 2022 10:30 AM

Belly Fat : హార్వార్డ్ మెడికల్ హెల్త్ చెబుతున్న దాని ప్రకారం.. నడుము, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఒకరకంగా హెచ్చరిక లాంటిది. వైద్య భాషలో ఈ అనారోగ్య కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. దీనివల్ల టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పొట్ట, తొడల చూట్టూ పేరుకుపోయే కొవ్వులను వ్యాయామం ద్వారా అంత సులభంగా కరిగించలేం. తొడ కొవ్వు కంటే, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వుని కరిగించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కణాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇవి అంత సులభంగా విచ్ఛిన్నం కావు. దీన్ని లిపోలిసిస్ అంటారు.

మారిన జీవనశైలితో ప్రస్తుతం అనేకమంది బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనిని తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఫలితం శూన్యం. బెల్లీఫ్యాట్‌ ని కరిగించడం అంత ఈజీ కాదు.. కానీ పరగడుపున ఒక జ్యూస్ తాగితే సులువుగా కరిగిపోతుంది. ఇందులోని పదార్థాలు కొవ్వుని కరిగించడానికి తోడ్పడతాయి. కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కొత్తిమీరను భారతీయ ఆహారంలో కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇది దాదాపు అంద‌రి ఇళ్లలోనూ సాధారణంగా ఉంటుంది. కొత్తిమీరను తినడం వల్ల అనేక ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి.

take this drink daily for 15 days to melt Belly Fat
Belly Fat

ముఖ్యంగా ప్రసవం తర్వాత పొట్టలో పేరుకుపోయే కొవ్వుతో చాలామంది మహిళలు ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు కొత్తిమీర జ్యూస్‌ తాగవచ్చు. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జ్యుస్ కోసం ముందుగా మీరు కొత్తిమీర, సోంపు, జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి తర్వాత దానిని ఫిల్టర్ చేసి వేడి టీ మాదిరి తాగాలి. కావాలంటే అందులో బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ జ్యుస్ లో ఉండే కొత్తిమీర, జీలకర్ర, సోంపు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now