Liger Movie : మరో చెత్త రికార్డును న‌మోదు చేసిన లైగ‌ర్‌.. శ‌ర‌వ‌ణ‌న్ మూవీ క‌న్నా దారుణ‌మైన సినిమాన‌ట‌..!

Liger Movie : అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దీనికి దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రీమియర్ షోస్ నుంచే రిజల్ట్ తేడా కొట్టింది. అయినా అది ఫస్ట్ డే కలెక్షన్స్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్, సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ కారణంగా చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తరువాత మాత్రం కలెక్షన్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో లైగర్ టీంపై ట్రోలింగ్ ఇంకా ఆగడం లేదు. దీనికి తోడు ఇప్పుడు ఈ మూవీ మరో డిజాస్టర్ రికార్డ్ సాధించిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే.. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ IMDB (ఇంట‌ర్నెట్ మూవీ డేటా బేస్) లైగర్ సినిమాకి అత్యంత తక్కువ రేటింగ్ ఇచ్చింది. ఆ రేటింగ్ ఎంతంటే.. 1.7/10. (ముందు ముందు ఈ రేటింగ్ పెరగొచ్చు లేదా ఇంకా చెత్తగా పడిపోవచ్చు.)

Liger Movie

ఇటీవల శరవణన్ నటించిన ది లెజెండ్ సినిమా విడుదలైంది. దీనికి IMDB సైట్ 4.7 రేటింగ్ ఇచ్చింది. అలాగే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాకి 5 రేటింగ్ ఇచ్చింది. మోహన్ బాబు సన్నాఫ్ ఇండియాకు కూడా 10కి 5 రేటింగ్ ఇచ్చింది. అలాంటిది స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ లైగర్ కి మాత్రం చాలా తక్కువ రేటింగ్ ఇచ్చింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఈ రేటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. లైగర్ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి దారుణమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా సైలెంట్ అయిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM