Fat : ఒకప్పుడు మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యకమైన ఆహారం తినేవారు. అందుకనే వంద ఏళ్లకు పైగా జీవించేవారు. ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఉరుకుల పరుగుల బిజీ జీవితం అయిపోయింది. ఈ క్రమంలో సమయానికి నిద్ర లేవడం లేదు. తిండి సరిగ్గా తినడం లేదు. తిన్నా అధికంగా తింటున్నారు. అది కూడా జంక్ ఫుడ్, నూనె ఆహారాలను ఎక్కువగా తింటున్నారు. మరోవైపు వ్యాయామం, శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో రోగాల పుట్టలుగా మారుతున్నారు. అయితే మనం తినే ఆహారమే మనకు మెడిసిన్ లాంటిదని ఒక శాస్త్రవేత్త చెప్పినట్లు.. మనం తినే ఆహారం ఎలాగైతే బరువు పెరిగేందుకు కారణం అవుతుందో.. అలాగే ఆ ఆహారంతోనే బరువు తగ్గించుకోవచ్చు. అంటే.. బరువును పెంచేవి కాక.. బరువును తగ్గించే ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది. బరువు తగ్గుతారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠానీలను చాలా మంది వంటల్లో వేస్తుంటారు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే పచ్చి బఠానీల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. కనుక పచ్చి బఠానీలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. బరువును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే బరువు తగ్గేందుకు బంగాళా దుంపలు కూడా సహాయ పడతాయి.
ఆలుగడ్డలు దుంప జాతికి చెందినవి కనుక వీటిని తింటే బరువు పెరుగుతామని అందరూ భావిస్తారు. కానీ ఆలుగడ్డలను వేపుడు, చిప్స్ రూపంలో తింటేనే బరువు పెరుగుతారు. అలా కాకుండా ఉడకబెట్టి కూరలా చేసి తింటే ఏమీ కాదు. ఇలా తింటే బరువు పెరగరు. బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గేందుకు ఆలుగడ్డలను కూడా తరచూ తినాల్సి ఉంటుంది. వీటిల్లో ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కనుక మనకు పోషణ లభిస్తుంది. మరోవైపు బరువు కూడా తగ్గుతారు.
ఇక గుమ్మడికాయలు కూడా బరువును తగ్గించగలవు. వీటిల్లో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే కొవ్వును కరిగిస్తాయి. బరువును తగ్గిస్తాయి. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక గుమ్మడికాయలను కూడా తినాలి. అయితే ఇవి తియ్యగా ఉంటాయి కనుక షుగర్ ఉన్నవారు తినరాదని అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. తియ్యగా ఉన్నప్పటికీ వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా నిర్భయంగా గుమ్మడికాయలను తినవచ్చు. దీంతో బరువును కూడా తగ్గించుకోవచ్చు.
పాలకూర కూడా బరువును తగ్గించగలదు. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల వైరస్‌ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు క్యాన్సర్, షుగర్ రాకుండా చూస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తాయి. కనుక పాలకూరను తరచూ తినాలి. వీటితోపాటు కాలిఫ్లవర్, పెసలు, టమాటాలు, చిలగడ దుంపలను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని రోజూ తింటుంటే బరువు సులభంగా తగ్గుతారు. దీంతో ప్రాణాంతక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…