Chiranjeevi : కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో స్వాతిముత్యం ఒకటి. దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 27, 1985న విడుదల అయింది. ఇందులో కమల్ హాసన్ హీరోగా.. రాధిక హీరోయిన్ గా నటించారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కున్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం ఎలా కొనసాగింది అనే నేపథ్యంలో విశ్వనాథ్ ఈ చిత్రాన్ని క్లాసికల్ మూవీగా తెరకెక్కించారు.
చిత్రంలో కమల్ హాసన్ మంద బుద్ధిగల పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో కమల్ హాసన్ కి, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి, దర్శకుడు కే.విశ్వనాథ్ కి ఉత్తమ జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. స్వాతిముత్యం సక్సెస్ సాధించిన తరువాత తమిళంలో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు కమల్ . అనంతరం ఈ చిత్రం కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయబడింది. ఎంతో స్టార్ డం ఉన్న కమల్ హాసన్ ఈ సినిమాలో మందబుద్ధి కలిగిన పాత్రలో నటించడం అప్పట్లో పెద్ద సాహసమనే చెప్పాలి.
మరోవైపు ఈ సినిమాలో మంద బుద్ది పాత్ర పోషించిన కమల్ హాసన్‌తో రాధికకి ఓ లవ్ సాంగ్ పెట్టాడు. వీరిద్దరి మధ్య రొమాన్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ మాదిరిగానే చిరంజీవి కూడా ఆరాధన చిత్రం కోసం హీరోయిన్ సుహాసినితో రొమాన్స్ చేయాల్సి ఉండగా.. కమల్ హాసన్ ని కాపీ కొట్టబోయి విఫలం చెందారట. ఒకరినీ కాపీ కొట్టడంలో ఎలాంటి ఉపయోగం ఉండదని.. మీలా మీరు నటించండి అంటూ దర్శకుడు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని చిరంజీవి విరమించుకున్నాడని తెలుస్తుంది. కమల్ హాసన్, చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోలు అనే విషయం మనకు తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…