Honey : ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు , జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక శ్రమ తగ్గడంతో భారీగా బరువు పెరుగుతున్నారు. అతి చిన్న వయసులోనే పెద్ద పొట్టతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద బాన లాంటి పొట్టను కరిగించి స్లిమ్‌గా కనిపించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బానలాంటి పొట్టను తగ్గించుకోవడంలో తేనే పరమౌషధంలా పనిచేస్తుంది. తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఔషధాలలో ఒకటి. తేనె న్యాచురల్ తీయదనాన్ని కలిగి ఉండే ఒక జిగట ద్రవం. తేనె అనేది పువ్వులలో మకరందం నుండి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఆరోగ్యవంతమైన ఆహారాలలో తేనెను ఒకటిగా పేర్కొంటారు.
వివిధ ఔషధ విలువలు కలిగిన ఒక అద్భుత ఉత్పత్తి తేనె. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, సల్ఫర్, భాస్వరం, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు కలిగి ఉంటుంది. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషక విలువలు కలిగి ఉన్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు.
ఇంత శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండవు. మరి ఇన్ని పోషక విలువలు కలిగి ఉన్న అద్భుతమైన తేనెతో బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరచి అధిక బరువును నియంత్రణలో ఉంచుతాయి.
ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బాగా కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా రోజూ ఒక టీ స్పూన్ తేనె తీసుకోవడం వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రక్తంలో తగినంత ఐరన్ లేనప్పుడు, మనిషికి అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తం ద్వారా మెదడు, గుండె వంటి భాగలకు ఆక్సిజన్ ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన నిత్యము తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య దరిచేరనివ్వదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…