Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం నాగ చైతన్యను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎప్పుడైతే సమంతతో లవ్ అంటూ పాపులర్ అయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది. కొందరేమో హీరోయిన్ మొగుడుగా పాపులర్ అయ్యావంటారు.. కొందరేమో నీ తండ్రి పేరుతో పాపులర్ అయ్యావు అంటారు.
అయితే రీసెంట్ నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం సినిమా షూటింగ్ ఆగిపోవడమే. నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో గ్రాండ్ గా ప్రారంభమైంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం దగ్గర మద్యం విక్రయ కేంద్రం సెట్ వేశారు. అయితే పవిత్ర ప్రదేశంలో ఇలా మద్యం సెట్ వేయడంపై అక్కడి స్థానికులు చిత్ర బృందంపై ఫైర్ అయ్యారు. అంతేకాదు సెట్ ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సినిమా సిబ్బందిని పరిగెత్తించి కొట్టారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య కూడా అక్కడే ఉన్నారని ఆయన కూడా పరుగులు పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది. నిజానికి షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా చిత్ర యూనిట్ దాన్ని ఉల్లంఘించిందని స్థానిక కన్నడ సంఘ ప్రతినిధులు విమర్శించారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా సరే సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య టైం అస్సలు బాగాలేదని ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…