Dry Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్ సి కి బ్యాంక్ లాంటిది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు. అలాంటి సమయంలో ఉసిరిని వాడాలి అంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి నిలువ చేసుకోవచ్చు. వీటిని ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండులో కంటే 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండడంతో గొంతు నొప్పి, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నోటిపూతను కూడా నయం చేస్తుంది. ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉసిరి ముక్కలను తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉసిరి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా రోజూ ఉసిరి తిని ఆరోగ్యంగా ఉండండి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…