Dry Amla : రోజూ మ‌ధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇవి 2 నోట్లో వేసుకుంటే అన్ని రోగాలు మాయం..!

September 30, 2022 1:35 PM

Dry Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్‌ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌ సి కి బ్యాంక్‌ లాంటిది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు. అలాంటి సమయంలో ఉసిరిని వాడాలి అంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి నిలువ చేసుకోవచ్చు. వీటిని ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండులో కంటే 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండడంతో గొంతు నొప్పి, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నోటిపూతను కూడా నయం చేస్తుంది. ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

take Dry Amla daily after meals at noon for these benefits
Dry Amla

యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉసిరి ముక్కలను తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉసిరి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా రోజూ ఉసిరి తిని ఆరోగ్యంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now