Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 153 చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోగా, మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో చిరంజీవే వదులుకోవడం జరిగింది.
ఇలా చిరంజీవి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అవ్వగా, మరొక సినిమా సెట్స్ మీద ఉంది. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. మరీ చిరంజీవి వదులుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దామా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మొనగాడు సినిమాను మొదటిగా చిరంజీవి వదులుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే చిరంజీవికి స్టార్ హీరోగా ఇమేజ్ రావడంతో ఆ పాత్ర తనకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ అవకాశం యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయింది.
వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మిద్దామని అనుకున్నారు. ఆ సమయంలో శ్రీదేవి పాత్ర ఎక్కువగా ఉండడంతోపాటు, ఆమె పుల్ బిజీగా ఉండడంతో ఆ సినిమా వదులుకున్నారు చిరంజీవి. అలా ఆఖరి పోరాటం చిత్ర అవకాశం కాస్త నాగార్జునకి దక్కింది. ఈ చిత్రంతో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
ఇక ఈ చిత్రాలే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్, మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ, వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి, త్వరలో ప్రేక్షకుల ముందుకు రవితేజ హీరోగా రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను చిరంజీవి వదులుకున్నారు. ఈ 8 చిత్రాల్లో ఆంధ్రావాలా డిజాస్టర్‌గా నిలవగా, టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పైన ఉంది. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. అలా పలు బ్లాక్ బస్టర్ మూవీలను చిరంజీవి మిస్ చేసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…