Diabetes : నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మూడు పదుల వయసు దాటక ముందే డయాబెటిస్ రోగులుగా మారుతున్నారు. డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు మనకు బాగా ఉపయోగపడుతాయి.
మీ అందరికీ కాకరకాయ బాగా తెలిసి ఉంటుంది. కాకరకాయ తినడం అంటే చాలా మందికి ఇష్టముందడదు. మరికొందరైతే దీని పేరు చెప్పగానే కాకరకాయ.. అని చిరాగ్గా మొహం పెడతారు. అయితే చాలా మందికి కాకరకాయలో ఉండే మంచి గుణాల గురించి తెలియక దగ్గరకు కూడా రానివ్వరు. ఇది తినడానికి చేదు ఉన్నప్పడికీ ఇందులో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు హానికరమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు కాకరకాయ జ్యూస్ తాగడం వలన తొలగిపోతాయి.
కాకరను జ్యూస్‌లా చేసి తాగితే శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు అందుతాయి. శరీంలో కేలరీల పరిమాణాన్ని పెంచుతాయి. కాకరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోఉంటుంది. గర్భ ధారణ సమయంలో వచ్చే సమస్యలు, అనేక చర్మ సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువును నియంత్రించడంలో కూడా కాకరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.
డయాబెటిస్ ను నియంత్రించే కాకరకాయ జ్యూస్ ను ఏవిధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం మొదట తొక్కతో ఉన్న ఒక కాకరకాయను, ముక్కలు చేసిన ఉసిరికాయ 2, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసు నీళ్లు, సగం నిమ్మకాయ రసం, సాల్ట్ అన్నీ వేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇలా వచ్చిన కాకరకాయ జ్యూస్ ని ఉదయం పరగడుపున తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…