Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మళయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లుగా వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో అనుపమ క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. ఆంధ్రలో వరదలు.. అనుపమ నా మరదలు అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ ను ఖాతాలో వేసుకుంది.
నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ హిందీలో ఊహించని స్థాయిలో హిట్ కొట్టి రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 హిట్ తర్వాత అనుపమ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇటీవల కెరీర్ నెమ్మదించి అవకాశాలు లేక అల్లాడిన అనుపమ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్యూట్ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. సినిమాలు పూర్తిగా మానేసి పెళ్లి చేసుకొని సెటిలైపోనుందట. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి ఇకపై కొత్త చిత్రాలకు సైన్ చేయదట. అనుపమ ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉందని, ఇదే ఫైనల్ అని అంటున్నారు.
ఆమె పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారట. అనుపమ వయసు ప్రస్తుతం 26 సంవత్సరాలు అంటే.. పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్. హీరోయిన్స్ కి మాత్రం అది పెళ్లీడు కాదు. కనీసం 35 ఏళ్ళు దాటాకే పెళ్లి చేసుకుంటారు. అప్పటికీ ఫామ్ లో ఉంటే పెళ్లి పక్కన పెట్టేస్తారు. ఆఫర్స్ లేక ఫేడ్ అవుట్ దశకు చేరినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అలాంటిది అనుపమ మాత్రం పెళ్లి కోసం కెరీర్ ను వదిలేయడం సంచలనంగా మారింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో 18 పేజెస్, బట్టర్ ఫ్లై అనే 2 చిత్రాలు ఉన్నాయి. ఇవి కూడా హిట్ అయితే అనుపమ కెరీర్ పీక్స్ లో ఉన్నట్టే. మరి అప్పటికి ఈ నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…