Turmeric : పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కర్‌క్యుమిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడేస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
2. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
3. పాలలో పసుపు కలుపుకుని తాగితే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవు. అలాగే క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి.
4. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక పసుపును పాలలో కలిపి తాగితే కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
5. పసుపును తీసుకుంటే మతిమరుపు సమస్య తగ్గుతుంది. దీన్ని గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా అవి మానుతాయి. అలాగే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్, హైబీపీ తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…