T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 30వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. కేవలం 84 పరుగులకే బంగ్లా ఆలౌట్ కాగా సఫారీలు స్వల్ప లక్ష్యాన్ని 39 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. దీంతో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో బంగ్లా జట్టు 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో మహేది హసన్ 27 పరుగులు, లైటస్ దాస్ 24 పరుగులు చేశారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, నోర్‌జెలు చెరో 3 వికెట్లు పడగొట్టగా, తబ్రెయిజ్ శంషీ 2 వికెట్లు తీశాడు. ప్రిటోరియస్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 86 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో బవుమా 31 పరుగులు, రాసీ వన్ డర్ డుసెన్ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, మహెది హసన్, నసుమ్ అహ్మద్‌లకు చెరొక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…