గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై ఘ‌న విజ‌యం సాధించిన సౌతాఫ్రికా

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 30వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. కేవ‌లం 84 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్ కాగా స‌ఫారీలు…

T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై ఘ‌న విజ‌యం సాధించిన సౌతాఫ్రికా

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 30వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. కేవ‌లం 84 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్ కాగా స‌ఫారీలు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 39 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించారు. దీంతో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 south africa won by 6 wickets against bangladesh in 30th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో 18.2 ఓవ‌ర్ల‌లో బంగ్లా జ‌ట్టు 84 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ల‌లో మ‌హేది హ‌స‌న్ 27 ప‌రుగులు, లైట‌స్ దాస్ 24 ప‌రుగులు చేశారు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడా, నోర్‌జెలు చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, త‌బ్రెయిజ్ శంషీ 2 వికెట్లు తీశాడు. ప్రిటోరియ‌స్‌కు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13.3 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల‌ను కోల్పోయి 86 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ల‌లో బ‌వుమా 31 ప‌రుగులు, రాసీ వ‌న్ డ‌ర్ డుసెన్ 22 ప‌రుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ట‌స్కిన్ అహ్మ‌ద్ 2 వికెట్లు తీయ‌గా, మ‌హెది హ‌స‌న్‌, న‌సుమ్ అహ్మ‌ద్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి