T20 World Cup 2021 : ఎంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలు కావడంతో ఇప్పుడందరూ భారత ప్లేయర్లను దారుణంగా విమర్శిస్తున్నారు. అభిమానులు అయితే కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత ఆటగాళ్లు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
అయితే టీమిండియాను విమర్శిస్తున్న వారిలో తాజాగా పాక్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. భారత ఆటగాళ్లపై అక్తర్ ఘాటు విమర్శలు చేశాడు. భారత ప్లేయర్లు క్రికెట్ ఆడేది ఇన్‌స్టాగ్రామ్‌లోనా.. లేక మైదానంలోనా ? అని విమర్శించాడు. టాస్ ఓడిపోయామని చెప్పి భారత్ రెండు మ్యాచ్‌లను వదిలేసుకుందని ఆరోపించాడు. కనీసం పోరాట పటిమను కూడా చూపలేదన్నాడు.
కొందరు ప్లేయర్లు బాగానే ఆటతీరును ప్రదర్శించినా.. జట్టులో చాలా మంది విఫలం అయ్యారని.. ఇదే విధంగా ముందుకు సాగితే ఆఫ్గనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. కాగా భారత్ బుధవారం ఆఫ్గనిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న భారత్ అద్బుతాలపైనే ఆశలు పెట్టుకుంది. అవి జరిగితే కానీ.. భారత్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…