T20 World Cup 2021 : మీరు క్రికెట్ ఆడేది ఇన్‌స్టాగ్రామ్‌లోనా.. మైదానంలోనా..?

November 1, 2021 12:18 PM

T20 World Cup 2021 : ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలు కావ‌డంతో ఇప్పుడంద‌రూ భార‌త ప్లేయ‌ర్ల‌ను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అభిమానులు అయితే కెప్టెన్‌గా రోహిత్‌ను నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భార‌త ఆట‌గాళ్లు త‌ల‌లు ఎక్క‌డ పెట్టుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు.

T20 World Cup 2021 Shoaib Akhtar criticized team india after their loss

అయితే టీమిండియాను విమ‌ర్శిస్తున్న వారిలో తాజాగా పాక్ లెజెండ‌రీ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కూడా చేరిపోయాడు. భార‌త ఆట‌గాళ్ల‌పై అక్త‌ర్ ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు. భార‌త ప్లేయర్లు క్రికెట్ ఆడేది ఇన్‌స్టాగ్రామ్‌లోనా.. లేక మైదానంలోనా ? అని విమ‌ర్శించాడు. టాస్ ఓడిపోయామ‌ని చెప్పి భార‌త్ రెండు మ్యాచ్‌ల‌ను వ‌దిలేసుకుంద‌ని ఆరోపించాడు. కనీసం పోరాట ప‌టిమ‌ను కూడా చూప‌లేద‌న్నాడు.

కొంద‌రు ప్లేయర్లు బాగానే ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించినా.. జ‌ట్టులో చాలా మంది విఫ‌లం అయ్యార‌ని.. ఇదే విధంగా ముందుకు సాగితే ఆఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయినా ఆశ్చర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్నాడు. కాగా భార‌త్ బుధ‌వారం ఆఫ్గ‌నిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే సెమీస్ ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేసుకున్న భార‌త్ అద్బుతాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. అవి జ‌రిగితే కానీ.. భార‌త్ సెమీస్ కు వెళ్లే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now