T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కష్టపడి ఛేదించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో మొయిన్ అలీ అర్ధ సెంచరీతో రాణించాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలీ 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో డేవిడ్ మలన్ 41 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నె, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో డారిల్ మిచెల్, డివాన్ కాన్‌వేలు రాణించారు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మిచెల్ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే కాన్‌వే 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టోన్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీయగా, ఆదిల్ రషీద్‌కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో విజయంతో న్యూజిలాండ్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 11వ తేదీన రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన వారు కివీస్‌తో ఈ నెల 14వ తేదీన దుబాయ్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో తలపడతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…