T20 World Cup 2021 : ఇంగ్లండ్‌పై గెలిచిన న్యూజిలాండ్‌.. ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశం..!

November 10, 2021 11:18 PM

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ మొద‌టి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ విజ‌యం సాధించి ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కివీస్ క‌ష్ట‌ప‌డి ఛేదించింది. ఈ క్ర‌మంలోనే ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 newzealand won by 5 wickets against england in 1st semi final

మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మొయిన్ అలీ అర్ధ సెంచ‌రీతో రాణించాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో అలీ 51 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో డేవిడ్ మ‌ల‌న్ 41 ప‌రుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌతీ, ఆడ‌మ్ మిల్నె, ఇష్ సోధీ, జేమ్స్ నీష‌మ్ లు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో డారిల్ మిచెల్‌, డివాన్ కాన్‌వేలు రాణించారు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో మిచెల్ 73 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అలాగే కాన్‌వే 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 46 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ వోక్స్‌, లియామ్ లివింగ్ స్టోన్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీయ‌గా, ఆదిల్ ర‌షీద్‌కు 1 వికెట్ ద‌క్కింది.

ఈ మ్యాచ్‌లో విజ‌యంతో న్యూజిలాండ్ ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఈ నెల 11వ తేదీన రాత్రి 7.30 గంట‌ల‌కు దుబాయ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన వారు కివీస్‌తో ఈ నెల 14వ తేదీన దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now