T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 21వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై నమీబియా విజయం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని నమీబియా తడబడుతూ ఛేదించింది. ఈ క్రమంలో స్కాట్లండ్‌పై నమీబియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా స్కాట్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్లలో మైకేల్ లియాస్క్ 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. 27 బంతులు ఆడిన మైకేల్ 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అలాగే క్రిస్ గ్రీవ్స్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్‌మన్ 3 వికెట్లు తీయగా, జాన్ ఫ్రైలింక్ 2 వికెట్లు తీశాడు. జేజే స్మిట్, డేవిడ్ వెయెసెలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లను కోల్పోయి 115 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్‌మెన్‌లలో జేజే స్మిట్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. 23 బంతులు ఆడిన స్మిట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. క్రెయిగ్ విలియమ్స్ అనే మరో బ్యాట్స్‌మన్ 23 పరుగులు చేయగా.. అందులో 1 సిక్స్ ఉంది. స్కాట్లండ్ బౌలర్లలో మైకేల్ లియాస్క్ 2 వికెట్లు తీశాడు. బ్రాడ్ వియల్, సఫ్‌యాన్ షరీఫ్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…