T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 20వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 124 పరుగులను మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికుర్ రహీమ్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జేసన్ రాయ్ 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించగా.. డేవిడ్ మలన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్‌లక చెరొక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…