T20 World Cup 2021 : దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ చాలా సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడకలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఒక్కడే 44 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన కూడా చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. 2 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జాస్ బట్లర్ 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, జేసన్ రాయ్ 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో ఆష్‌టాన్ అగర్, ఆడమ్ జంపాలు చెరొక వికెట్ తీశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…