గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : ఆసీస్‌ను చిత‌క్కొట్టిన ఇంగ్లండ్‌.. అల‌వోక‌గా గెలుపు..

T20 World Cup 2021 : దుబాయ్‌లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ చాలా సునాయాసంగా ఛేదించింది.…

T20 World Cup 2021 : ఆసీస్‌ను చిత‌క్కొట్టిన ఇంగ్లండ్‌.. అల‌వోక‌గా గెలుపు..

T20 World Cup 2021 : దుబాయ్‌లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ చాలా సునాయాసంగా ఛేదించింది. కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయిన ఇంగ్లండ్ 11.4 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది.

T20 World Cup 2021 england won by 8 wickets against australia in 26th match

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 125 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిల‌బ‌డ‌క‌లేక‌పోయారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఒక్క‌డే 44 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శన కూడా చేయ‌లేదు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, క్రిస్ వోక్స్‌, టైమ‌ల్ మిల్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఆదిల్ ర‌షీద్‌కు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 11.4 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని సులువుగా ఛేదించింది. 2 వికెట్ల‌ను కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 71 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, జేస‌న్ రాయ్ 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స‌ర్‌తో 22 ప‌రుగులు చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆష్‌టాన్ అగ‌ర్‌, ఆడ‌మ్ జంపాలు చెరొక వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి