Swayam Krushi Arjun : స్వయంకృషి సినిమా చిన్నోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

August 31, 2022 1:38 PM

Swayam Krushi Arjun : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్ద అయ్యాక హీరోగా చాలామంది సక్సెస్ అయ్యారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించినప్పటికీ హీరోగా ప్రయత్నించి విఫలమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించగా చైల్డ్ ఆర్టిస్ట్.. మాస్టర్ అర్జున్ కీ రోల్ లో నటించాడు. ఇందులో మాస్టర్ అర్జున్ నటనతో అందరినీ కట్టిపడేశాడు.

ఆ తర్వాత తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా వచ్చిన పచ్చని కాపురం సినిమాలో కూడా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు మాస్టర్ అర్జున్. ఈ సినిమాలో శ్రీదేవి, కృష్ణ విడిపోయిన తర్వాత ఎంతో బాధపడే కొడుకు పాత్రలో నటించాడు అర్జున్. అలాగే శోభన్ బాబు, సుహాసిని, ప్రీతిలు నటించిన ఇల్లాలు ప్రియురాలు సినిమాలో కూడా మాస్టర్ అర్జున్ నటించాడు. ఇందులో శోభన్ బాబు ప్రియురాలు ప్రీతికి జన్మించిన బాలుడిగా అర్జున్ నటించాడు. ప్రియురాలు ప్రీతి చనిపోవడంతో మాస్టర్ అర్జున్ సుహాసిని ఇంటికి వెళ్తాడు.

Swayam Krushi Arjun do you know how he is now
Swayam Krushi Arjun

అక్కడ సుహాసిని పిల్లలతో, సుహాసినితో తిట్లు తింటూ ఉంటాడు. ఆ సమయంలో అర్జున్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. అలా చిన్నతనంలోనే ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఒదిగిపోయిన మాస్టర్ అర్జున్ హిందీ, కన్నడ, భాషలలో కూడా నటించాడు. పెద్దవాడైన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు. అయినప్పటికీ సంగీతంపై మక్కువ ఉండడంతో అప్పుడప్పుడూ సంగీత కచేరీలు చేస్తున్నాడు అర్జున్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment