Surekha Vani : టాలీవుడ్ లో గ్లామర్ గా ఉన్న అతి కొద్దిమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒకరు. హీరో హీరోయిన్ లకు అక్క, వదిన క్యారెక్టర్ లు చేస్తున్నా.. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో బిజీ బిజీగా సురేఖావాణి ఎమోషనల్ సీన్ లు, కామెడీ సీన్లలో సైతం నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటోంది. ఆమె కుమార్తె సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం.
తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా.. సురేఖా వాణి, సుప్రీతలను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వారికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వేశాడు. అందుకు వాళ్లు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు. కొన్ని సీరియస్ ఇష్యూస్ కి కూడా నిఖిల్ తనదైన శైలిలో సమాధానాలు రాబట్టాడు. ఇప్పుడు నిఖిల్ సింహా అడిగిన ఓ ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది.
త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా ? అంటూ నిఖిల్ ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించింది. అంతేకాకుండా చేసేద్దాం సింగిల్ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచీ నా బుర్ర తింటోంది అంటూ కామెంట్ చేసింది. బాయ్ ఫ్రెండ్ విషయంలో నిఖిల్ మరో ప్రశ్న అడిగాడు.
మీరిద్దరూ సింగిలేనా ? అంటూ తల్లీ కుమార్తెలను ప్రశ్నించగా.. ఇద్దరూ అవునని చెప్పారు. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని కోరగా.. నన్ను భరిస్తే చాలంటూ సుప్రీత సమాధానం చెప్పింది. సురేఖ మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ రివీల్ చేసింది. 6 ఫీట్ హైట్ ఉండాలి, మంచి కలర్, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్ గా గడ్డం ఉండాలి.. అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వీరి కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…