Sunrisers Hyderabad : అర‌బిక్ కుతు పాట‌కు స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్ల స్టెప్పులు.. వీడియో..!

April 14, 2022 3:51 PM

Sunrisers Hyderabad : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2022 ఎడిష‌న్‌లో చెన్నై, ముంబై వంటి టీమ్‌లు చ‌తికిల‌ప‌డుతున్న విష‌యం విదిత‌మే. అయితే చెన్నై ఎట్ట‌కేల‌కు త‌మ 5వ మ్యాచ్‌లో గెల‌వ‌గా.. ముంబై మాత్రం ఈ సీజ‌న్‌లో ఇంకా బోణీ కొట్ట‌లేదు. ఆడిన 5 మ్యాచ్‌ల‌లో 5 ఓడిపోయింది. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే.. మొద‌టి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా.. గ‌త 2 మ్యాచ్‌ల‌లోనూ నెగ్గి ఈ టీమ్ ఊపు మీద ఉంది. ఇక చివ‌రిగా సన్ రైజ‌ర్స్ జ‌ట్టు తాజాగా గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ క్ర‌మంలోనే టీమ్ అంతా అర‌బిక్ కుతు సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.

Sunrisers Hyderabad team players danced for Arabic Kuthu song viral video
Sunrisers Hyderabad

గుజ‌రాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో గెలిచిన అనంత‌రం హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సంద‌డి చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అభిషేక్ శ‌ర్మ‌, ప్రియ‌మ్ గార్గ్‌, జ‌గ‌దీశ సుచిత్‌లు అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. దీంతో వారి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రెండు వ‌రుస విజయాల‌తో స‌న్ రైజ‌ర్స్ టీమ్ మంచి జోరు మీదుంద‌ని.. ఆ వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

 

View this post on Instagram

 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

ఇక త‌ళ‌ప‌తి విజయ్‌, పూజా హెగ్డె న‌టించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఈ మూవీ మిశ్ర‌మ టాక్‌ను తెచ్చుకుంటోంది. కొన్ని చోట్ల సినిమా బాగా లేద‌ని విజ‌య్ ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు. ఒక చోట థియేట‌ర్‌లో తెర‌ను త‌గుల‌బెట్టారు. అయితే ఈ మూవీలోని అర‌బిక్ కుతు పాట మాత్రం చాలా ఫేమ‌స్ అయింది. ఇప్ప‌టికే ఈ పాట‌కు ఎంతో మంది క్రీడా, సినీ సెల‌బ్రిటీలు డ్యాన్స్ చేసి త‌మ స‌ర‌దా తీర్చుకున్నారు. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్లు కూడా ఈ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now