Sunny Leone : ఏ నటి చేయని వ్యాపారంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్..!

November 5, 2021 2:20 PM

Sunny Leone : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో అడుగు పెట్టి రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా నటి సన్నీలియోన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇదివరకు ఏ భారతీయ నటి చేయని వ్యాపారంలోకి అడుగు పెడుతూ.. ఈ వ్యాపారాన్ని చేస్తున్న మొట్టమొదటి భారతీయ నటిగా సన్నిలియోన్ పేరు సంపాదించుకున్నారు. మరి ఈమె చేస్తున్న వ్యాపారం ఏంటి అనే విషయానికి వస్తే..

Sunny Leone to do new type of auction business first time in india

ఎన్‌ఎఫ్‌టీ అనే ఒక డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాపారంలోకి ప్రముఖ హీరోలైన అమితాబచ్చన్, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్ వంటి వారు అడుగు పెట్టారు. ఇందులో భాగంగా వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన విషయాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి వేలం వేస్తారు. అయితే ఈ వ్యవహారం మొత్తం బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతుంది.

ఇలా వేలం వేసిన వీటిని ఎవరైనా కొనుగోలు చేసి తర్వాత వాటిని మరొకసారి వేలం వేసుకోవచ్చు. అయితే ఇలా వేలం జరిగిన ప్రతిసారీ వచ్చే ఆదాయంలో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియేటర్లకు వాటాగా వెళుతుంది. తాజాగా ఇలాంటి వ్యాపారంలోకి నటి సన్నీలియోన్ అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్నీ లియోన్ స్పందిస్తూ మిస్‌ ఫిట్జ్‌ పేరుతో తన ఎన్‌ఎఫ్‌టీ వివరాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ తనని కలవండి, తనకు గులాబీ రంగు, టాటూలు వేయించుకున్న అబ్బాయిలు అంటే ఎంతో ఇష్టం అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఏది ఏమైనా ఇలాంటి వ్యాపారంలోకి అడుగు పెట్టిన మొట్టమొదటి భారతీయ నటిగా సన్నీ లియోన్ గుర్తింపు సంపాదించుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment