Sunil : మ‌హేష్‌ను ‘గొడ్డు’ అంటూ కామెంట్ చేసిన సునీల్‌..!

December 25, 2021 3:58 PM

Sunil : సునీల్ సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌దైన శైలిలో రాణిస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ త‌ర్వాత హీరోగా ఇప్పుడు పుష్ప‌తో విల‌న్‌గా కూడా మారాడు. తెలుగు సినిమాలో గోదావరి యాసతో మాట్లాడే హాస్య నటుడిగా బెస్ట్ ఆప్షన్ అయిన సునీల్.. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి అనేక సినిమాల్లో హాస్యనటుడిగా అలరిస్తూనే అందాల రాముడు, మర్యాదరామన్న వంటి అనేక సినిమాల్లో హీరోగా నటించాడు.

Sunil compared mahesh babau as buffalo

సుమారుగా 200 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన సునీల్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పలో విలన్ గా న‌టించి అద‌ర‌గొట్టాడు. మంగళం శీను పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయి మెప్పించాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విలన్‌గా చేసిన సునీల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.

మహేష్ బాబు గురించి చెబుతూ.. ఆయనను ‘గొడ్డు’తో పోల్చాడు. చూడడానికి క్యూట్ గా యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తాడు గానీ, గొడ్డు కష్టం పడతాడని అన్నాడు. అలాగే ముఖ్యంగా ఫైట్స్ లో అయితే మూడు, నాలుగు ఫ్లోర్స్ లో రోప్ లు కట్టేసి వేలాడదీస్తారు, ఇక గొడ్డే, అది అయ్యే దాకా అంతలా కష్టపడతారని అన్నారు. అలాగే మహేష్ బాబు ఓ డైరెక్టర్ ను నమ్మితే ఇంక లైఫ్ ఇచ్చేస్తాడు, అది తనకు బాగా నచ్చే గుణమని చెప్పుకొచ్చాడు సునీల్. ప్ర‌స్తుతం సునీల్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment