Sudigali Sudheer : బుల్లితెరపై అత్యంత సక్సెస్‌ను సాధించిన షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు వచ్చిన రేటింగ్స్ ఇప్పటి వరకు ఏ షోకు కూడా రాలేదనే చెప్పాలి. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ షో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కంటెస్టెంట్లు అందరూ ఒక్కొక్కరుగా ఈ షోకు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, ఆది, గెటప్ శ్రీను దూరమయ్యారు. రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసినా.. యాంకర్‌గా అనసూయ కూడా తప్పుకోనుందని సమాచారం. ఆమెకు సినిమాల్లో బాగా ఆఫర్లు వస్తున్నందున టీవీ షోలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నదట.
అయితే జబర్దస్త్ వేదికపై లవ్ ట్రాక్ కొనసాగిస్తున్న పెయిర్ ఏదైనా ఉంది అంటే.. అది సుధీర్, రష్మిల జోడీనే అని చెప్పవచ్చు. వీరి జోడీకి ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతుంటారు. అంతలా వీరి లవ్ ట్రాక్ ఫేమస్ అయింది. వీరిద్దరూ కలసి స్కిట్ చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఎన్నోసార్లు ఇలా ఈ జంట జబర్దస్త్ స్టేజిపై సందడి చేసింది. అయితే ఇప్పుడు సుధీర్ లేడు కనుక ఈ హిట్ పెయిర్‌ను మళ్లీ ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. కానీ ఇతర చానల్స్‌లోనూ వీరు తమ ట్రాక్‌ను కొనసాగిస్తున్నారు.
అయితే సుధీర్, రష్మిలు ఇలా జోడీగా కొనసాగుతుండడంతో వీరి మధ్య ఏదో ఉందని గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికీ అవి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరు అనేక సార్లు తమ మధ్య ఏమీ లేదని.. షో కోసమే అలా చేస్తున్నామని చెప్పేశారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇక ఇదే విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ కూడా తెలియజేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్ షోతోపాటు సుధీర్, రష్మిల గురించి పలు కీలక విషయాలను వెల్లడించాడు.
జబర్దస్త్‌లో అందరూ అకున్నట్లుగా రష్మి, సుధీర్‌ల మధ్య ఏదీ లేదని.. అదంతా వారు కేవలం షోకు రేటింగ్స్ కోసమే చేశారని తెలిపాడు. అలాగే ఈ షోకు సుధీర్ వల్లే బాగా పేరు వచ్చిందని అన్నాడు. అయితే ఈ షోలో నిర్వాహకులు తమకు ఎక్కువ మర్యాద ఇవ్వడం లేదని.. కనీసం భోజనాలు కూడా పెట్టరని అన్నాడు. కేవలం నాగబాబు మాత్రమే తమపై ప్రేమ చూపిస్తారని.. ఆయన గతంలో ఓ కంటెస్టెంట్‌కు ఆపరేషన్ కోసం సహాయం చేశారని తెలిపాడు. కాగా జబర్దస్త్ షోపై ఆర్‌పీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…