Star Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, తమన్నా, త్రిష ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
పైన ఫోటోలో రెడ్ డ్రెస్‌లో ఎంతో స్టైలిష్‌గా స్టెప్పులేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తొచ్చిందా..
ఆ చిన్నారి మరెవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కేవలం కెరీర్ ఆరంభించిన 5 ఏళ్లలో పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం తన ఇన్ స్టాలో చిన్ననాటి పిక్ షేర్ చేసుకుంది. అందులో స్జేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. స్కూల్లో డ్యాన్స్ చేస్తున్న పాటను కనిపెట్టండి.. 2004/2005లో జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే తలపతి విజయ నటిస్తోన్న వరిసు, హిందీలో గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…