SS Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ అనే పీరియాడికల్ చిత్రం చేయగా, ఈ మూవీని జవనరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, మరోవైపు రాజమౌళి సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన రాజమౌళి.. ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ.. అన్నారు. సరే సార్ అయితే మీరు టైమివ్వండి.. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను.
ఆ తర్వాత ఆయన దగ్గర్నుంచి కబురొస్తుందని చూశాను.. రాలేదు. ఆయన వేరే వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా.. నేను కూడా మోర్ బిగ్గర్, వైడర్ సినిమాలు చేయాలనే ఆలోచనతో ‘మగధీర’, ‘యమదొంగ’ వంటి సినిమాలు చేశాను. మా ఇద్దరి థింకింగ్ మారిపోయింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైంది. నేనేమో ఇటువైపు ఎక్కువ రోజులు సినిమాలకు కేటాయించాను. మేము ఇద్దరం రెండు వేరు వేరు మార్గాలలో ప్రయాణిస్తున్నాము. మా ఇద్దరివీ విభిన్న దారులు. ఇప్పటికీ ఆయనను ప్రేమిస్తుంటాను.. అని రాజమౌళి అన్నారు. ఫ్యూచర్‌లో కూడా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాదని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…