SS Rajamouli : పవన్‌ కల్యాణ్‌తో సినిమా ఎందుకు చేయలేదో.. రాజమౌళి చెప్పేశారు..!

October 31, 2021 6:04 PM

SS Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్ర‌స్తుతం ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ఆర్ఆర్ఆర్ అనే పీరియాడిక‌ల్ చిత్రం చేయ‌గా, ఈ మూవీని జవ‌న‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ‌వ్యాప్తంగా అంచ‌నాలు ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, మ‌రోవైపు రాజ‌మౌళి సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు.

SS Rajamouli told why he did not done movie with pawan kalyan

ఈ క్ర‌మంలో పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే ప్ర‌శ్న ఎదురైంది. దానికి స్పందించిన రాజ‌మౌళి.. ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ.. అన్నారు. సరే సార్ అయితే మీరు టైమివ్వండి.. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను.

ఆ తర్వాత ఆయన దగ్గర్నుంచి కబురొస్తుందని చూశాను.. రాలేదు. ఆయన వేరే వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా.. నేను కూడా మోర్ బిగ్గర్, వైడర్ సినిమాలు చేయాలనే ఆలోచనతో ‘మగధీర’, ‘యమదొంగ’ వంటి సినిమాలు చేశాను. మా ఇద్దరి థింకింగ్ మారిపోయింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైంది. నేనేమో ఇటువైపు ఎక్కువ రోజులు సినిమాలకు కేటాయించాను. మేము ఇద్దరం రెండు వేరు వేరు మార్గాలలో ప్రయాణిస్తున్నాము. మా ఇద్దరివీ విభిన్న దారులు. ఇప్ప‌టికీ ఆయ‌న‌ను ప్రేమిస్తుంటాను.. అని రాజ‌మౌళి అన్నారు. ఫ్యూచ‌ర్‌లో కూడా ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రాద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now