SS Rajamouli : పవన్ కళ్యాణ్‌ను కలవనున్న దర్శకధీరుడు.. భేటీ వెనుక కార‌ణం ?

November 22, 2021 1:36 PM

SS Rajamouli : తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో టికెట్ల ధరల విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా అడ్డుపడుతోందట. భీమ్లా నాయక్ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కారణంగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లకు సమస్య వస్తుందనేది డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.

SS Rajamouli may meet Pawan Kalyan for rrr movie
SS Rajamouli may meet Pawan Kalyan for rrr movie

ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి.. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా కలుసుకుని భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేయమని రిక్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా రాజమౌళి టీమ్ అభిప్రాయపడుతోంది. ఈ మీటింగ్ ను వచ్చే వారం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తారట. దీనికన్నా ముందుగానే డీవీవీ దానయ్య, దిల్ రాజు, వంశీతోపాటుగా మరికొంతమంది త్రివిక్రమ్ ను కలవడానికి సిద్ధమవుతున్నారట.

అలాగే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ను వాయిదా వేయమని, అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో సరికొత్త సలహాల్ని, మార్గాల్ని రూపాందించాలని కోరుతున్నారట. ఈ మీటింగ్స్ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఈ సీజన్ లోనే పోటీ పడనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now