Srireddy : మీ బోడి పెద్ద‌రికం ఎవ‌డికి కావాలి.. మోహ‌న్‌బాబు లేదా బాల‌కృష్ణ అయితేనే క‌రెక్ట్‌.. చిరంజీవిపై శ్రీ‌రెడ్డి కామెంట్స్‌..

January 4, 2022 4:32 PM

Srireddy : టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుతం అనేక స‌మ‌స్య‌లతో కొట్టుమిట్టాడుతున్న విష‌యం విదిత‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో టిక్కెట్ల రేట్లు అని ప్ర‌శ్నించుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే టాపిక్ డైవ‌ర్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. మోహ‌న్ బాబు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాయ‌డంతో చిరంజీవి తెర‌పైకి వ‌చ్చారు. తాను టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉండ‌లేన‌న్నారు. కావాలంటే ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని చెప్పారు.

Srireddy angry on chiranjeevi over his comments

అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టి శ్రీ‌రెడ్డి ఘాటుగా స్పందించింది. టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉండేందుకు చిరంజీవికి అర్హ‌త లేద‌ని వ్యాఖ్యానించింది. మీ బోడి పెద్ద‌రికం ఎవ‌డికి కావాలి, పెద్ద దిక్కుగా ఉండేందుకు బాల‌కృష్ణ లేదా మోహ‌న్‌బాబు అయితే క‌రెక్ట్‌గా స‌రిపోతారు, అయినా సినిమాల‌కు స‌మ‌స్య‌లు ఉంటే నిర్మాతలు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌కు వెళ్లి ప‌రిష్క‌రించుకోవాలి, కానీ అందులో హీరోల పెత్త‌నం ఏంటి ? అని శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది.

కాగా చిరంజీవిపై శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ కాగా.. చిరంజీవి గురించి త‌ప్పుగా మాట్లాడితే బాగుండ‌ద‌ని.. మెగా అభిమానులు శ్రీ‌రెడ్డిపై తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యం కాస్తా.. డైవ‌ర్ట్ అయి టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవ‌రు అనే వ‌ర‌కు వెళ్లింది. మ‌రి ముందు ముందు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now