Srikanth : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. హీరో శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా శ్రీకాంత్ విడాకులు తీసుకుంటున్నారనే పుకారుపై స్పందించారు. అందంతా ఫేక్ న్యూస్ అంటూ తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా ఇలానే ఓ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని శ్రీకాంత్ మండిపడుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
శ్రీకాంత్, ఊహ 1997లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి వైవాహిక బంధం ఎంతో ఆనందంగా సాగుతోంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా నిర్మల కాన్వెంట్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అలాగే పెళ్ళిసందD చిత్రంలో కూడా రోషన్ హీరోగా నటించాడు. అయితే గత రెండ్రోజులుగా హీరో శ్రీకాంత్, ఊహ విడిపోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయని, ఆర్థికపరమైన ఇబ్బందులే వీరి మధ్య గొడవలకు కారణమని వార్తలు ప్రచారం అవుతున్నాయి. కేవలం ఈ కారణాల వల్లే శ్రీకాంత్ విడాకులు తీసుకుని విడిపోతున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త ఊహా తెలియడంతో విషయం కాస్త శ్రీకాంత్ వరకు వెళ్ళింది.
దీనిపై శ్రీకాంత్ తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ విమర్శలను తీవ్రంగా ఖండించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలు అని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాగే నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ మరో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ , వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు, ఆందోళన పడవద్దని తనను ఓదార్చాను. కేవలం మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల బంధువుల సైతం మాకు కాల్ చేసి వార్త నిజమేనా అనే విషయాన్ని అడుగుతున్నారు. దీనికి వివరణ ఇచ్చుకోవడం వల్ల మాకు మరో న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది.
ఈ పుకార్లు మా కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఇకపైనైనా ఆపండి.. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ శ్రీకాంత్ మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తున్నాను అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…