Jaggery : రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను రోజూ తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..

Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక పంచదారకు బదులుగా బెల్లం ప్రతిరోజూ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

మరి బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాం.. ప్రతిరోజూ బెల్లం చిన్న ముక్క ఆహారంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే కడుపులో ఏర్పడే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ప్రేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బెల్లం మలబద్దకం సమస్యలను దూరం చేయడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Jaggery

బెల్లం స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీనింగ్ ప‌దార్థంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు. బెల్లం ర‌క్తాన్ని శుద్ధి చేసే ఔష‌ధ ప‌దార్థంగా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

అలాగే శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టకు పంప‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశ‌యం, ఆహార నాళం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. బెల్లంలో ఉండే పోష‌కాలు మ‌హిళ‌ల‌కు ఋతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి శ‌రీరాన్ని, మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తాయి. ఋతు స‌మ‌యంలో స్త్రీలు బెల్లంను రోజూ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

బెల్లంలో ఐర‌న్‌, ఫోలేట్‌లు స‌మృద్దిగా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తింటే మంచిది. హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం ద్వారా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చెవి నొప్పితో బాధపడేవారు బెల్లాన్ని నేతిలో ముంచి తినడం వలన చెవినొప్పి సమస్య తగ్గముఖం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM