Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో టాలీవుడ్‌కు చెమటలు పట్టించింది. ఈమె దెబ్బకు సినీ పెద్దలు షేక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈమె చెన్నైలోనే ఉంటోంది. తన యూట్యూబ్ చానల్ ద్వారా ఈమె ఎప్పటికప్పుడు వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడూ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ.. వాటిల్లో బాధ్యులైన వారిని విమర్శిస్తుంటుంది. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని దూషిస్తుంటుంది. ఈమె ఒక్క పోస్ట్ పెడితే చాలు.. అది క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఇక టాలీవుడ్‌లో మహిళలు మోసపోతున్నారని చెబుతూ ఈమె అప్పట్లో ఆరోపణలు చేసింది. కొందరు బడాబాబుల వల్లే మహిళలు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. ఈమె అప్పట్లో రచ్చ రచ్చ చేసింది.
ఇక ఈమె అప్పట్లో టాలీవుడ్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల పేర్లను కూడా ఈమె ఎలాంటి భయం లేకుండా బయట పెట్టేసింది. ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్నంగా ప్రదర్శన చేసింది. దీంతో ఈమె వార్త నేషనల్ మీడియాలోనూ కవర్ అయింది. తనకు, నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌కు అక్రమ సంబంధం ఉందని చెబుతూ.. తాము తీసుకున్న లిప్‌లాక్ ఫొటోలను కూడా ఈమె అప్పట్లో బయట పెట్టింది. ఈ క్రమంలోనే అభిరామ్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని.. ఈమె అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ తరువాత కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సద్దుమణిగింది. ఈమె చెన్నైకి వెళ్లిపోయింది.
ఇక చెన్నైకి వెళ్లిన తరువాత కూడా శ్రీరెడ్డి తనలోని ఫైర్ బాంబ్‌ను అప్పుడప్పుడూ పేల్చుతూనే వస్తోంది. ముఖ్యంగా ఈమె పవన్, నాగబాబు, నిహారికలపై ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఎంతో కాలంగా ఈమె వైసీపీకి సపోర్ట్ ఇస్తూ వచ్చింది. కానీ తమ గ్రామంలో గుడి కట్టించేందుకు సహాయం చేయలేదన్న కారణంగా ఈమె వైసీపీ వారిపై కూడా మండిపడుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్య ఈమె బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వాటిల్లో తన పెదవుల గురించి ఈమె చెప్పుకొచ్చింది.
మీ పెదవులు ఎందుకు ఇలా భారీ సైజ్ లో ఉంటాయని అరియానా అడగ్గా.. అందుకు శ్రీరెడ్డి బదులిస్తూ.. తాను చిన్నతనంలో మడత మంచం పై నుంచి కింద పడ్డానని.. దీంతో పెదవులు లావుగా మారాయని తెలిపింది. అయితే తరువాత తాను సర్జరీ చేయించుకున్నా.. అవి సెట్ కావడం లేదని తెలియజేసింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం తాను లైపో సక్షన్ సర్జరీని కూడా చేయించుకున్నానని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డికి చెందిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…