టాలీవుడ్ హీరోలకు పెద్ద దెబ్బే..? రెమ్యునరేషన్ లో భారీగా కోత..?

వందేళ్ల సినీ ప్రపంచానికి అనుకోని ఆపద వచ్చి పడింది. సినిమానే తమ ప్రధాన మాధ్యమం అనుకునే ప్రేక్షకులు తమ ఆలోచనను మార్చుకుని మొబైల్ లో సోషల్ మీడియా ద్వారా తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతున్నారు. ఇక కరోనా టైం లో ఓటీటీల హవా అందరికీ తెలిసిందే. ఓటీటీలను జనాలకు ఎలా అలవాటు చేయాలి అన్న తరుణంలోనే కోవిడ్ రావడం థియేటర్ లు మూసేయడం జరిగింది. దీంతో సినిమాని థియేటర్ కి వెళ్లి చూసే ఆడియెన్స్ కన్నా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అసలే మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టు టికెట్ల రేట్ల వ్యవహారం కూడా ఆడియెన్స్ కి చిరాకు తెప్పించాయి. ఇవన్నీ సినిమా మీద ప్రేక్షకులకు ఉన్న ప్యాషన్ ని దూరం చేశాయని చెప్పొచ్చు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే బొమ్మ చూడనిదే నిద్ర పోని ప్రేక్షకులు కూడా ఎందుకు అనవసర ఖర్చు.. ఓటీటీలోకి వచ్చాక చూసేద్దాం లే.. అనుకుంటున్నాడు. ఓటీటీల వల్ల సినిమాలకు ఏ రేంజ్ లో దెబ్బ పడుతుంది అన్నది చెప్పడానికి ఇది చాలు. అలా ఫ్రైడే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా చాలా తక్కువ అయింది.

Tollywood

ఇక ఇదొక సెగ్మెంట్ అయితే.. తెలియకుండానే నిర్మాతల‌కు అదనపు భారం హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్ రూపంలో పడుతోంది. సినిమా నిర్మాణంలో వీరిద్దరి పారితోషికమే 70 శాతం దాకా అవుతుందని తెలుస్తోంది. అందుకే ఈరోజుల్లో ప్రతి నిర్మాత నష్టపోవాల్సి వస్తోంది. అలా కాకుండా ఉండాలంటే అది ఒక కేజీఎఫ్ లేదా విక్రం సినిమాలు అయి ఉండాలి.

ఒకప్పుడు సినిమాని డిస్ట్రిబ్యూటర్ చాలా నమ్మకంతో కొనేవాడు.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నిర్మాతల మార్కెటింగ్ జిమ్మిక్కులను వారు కూడా తిప్పుకొడుతున్నారు. అందుకే భారీ లాస్ వచ్చిన డిస్ట్ర్యిబ్యూటర్స్ నిర్మాతల దగ్గర నుంచి కొద్దిమొత్తాన్ని రిటర్న్ తీసుకుంటున్నారు.

నిర్మాతలు కూడా సినిమా బడ్జెట్ ని రూ.5 కోట్లు మించకుండా చేస్తే బాగుంటుంది. అయితే సినిమా నిర్మాణం రూ.5 కోట్లు అంటే అందులో హీరోలకు ఎంత ఇవ్వాలి అన్నది మొదటి ప్రశ్న. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల వల్లే మాత్రమే సినిమా పరిశ్రమ నిలబడుతుంది అన్నది ఎంతవరకు నిజమన్నది ఆలోచించాలి. అయితే సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తే మాత్రం పరిశ్రమ మరింత సంక్షోభంలో పడుతుందని చెప్పొచ్చు.

పరిశ్రమలో నెలకొన్న ఈ పరిస్థితిని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫాం అవకాశంగా తీసుకుని వారి సబ్ స్క్రిప్షన్ ప్రైజ్ తగ్గిస్తే మాత్రం సినీ పరిశ్రమకు మరింత బొక్క పడే అవకాశం ఉంటుంది. అయితే స్టార్ హీరోలు తక్కువ టైంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని సినిమాలు చేస్తే ఈ పరిస్థితిని తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది.

అయితే సినిమా బడ్జెట్ పరిమితులు ఉంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రావు. అది ఆలోచించాల్సి విషయమే. అయితే ఒక సినిమాతో పోల్చుకుంటే 100 చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అందుకే ఈమధ్య నిర్మాతలు కూడా దీని మీద ఓ సీరియస్ నిర్ణయాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు హీరోల రెమ్యున‌రేష‌న్‌కు భారీగా కోత విధిస్తార‌ని తెలుస్తోంది. అయితే దీనిపై చివ‌రికి వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM