ఎన్నో భారీ అంచనాలతో ఈ ఆగస్టు 25న విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపుగా రూ.120 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలు భారీ నష్టాలను చవి చూసేలా చేసింది. పూరీ జగన్నాథ్, ఛార్మీల నిర్మాణ భాగస్వామ్యంలో కరణ్ జోహార్ సహకారంతో బాలీవుడ్ లో కూడా ఆగస్టు 25న విడుదలైన సినిమా లైగర్. రిలీజైన రోజు రెండవ షో నుండే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక కాంట్రవర్సి స్టార్ శ్రీ రెడ్డి కూడా లైగర్ చిత్రానికి రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టింది. శ్రీ రెడ్డి లైగర్ చిత్రానికి ఎన్ని మార్కులు వేసిందంటే..
లైగర్ సినిమా విడుదలైన వారం రోజులకు తన మార్క్ స్టైల్లో రివ్యూ ఇచ్చింది శ్రీరెడ్డి. చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు తగిలేట్టు పంచులు విసురుతూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది. కంటెంట్ లేని లైగర్ మూవీకి భారీ ప్రమోషన్స్ తో అంత హైప్ అవసరమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. లైగర్ చిత్రం కంటే హీరో నిఖిల్ కార్తికేయ2 సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఇంకా లైగర్ ముందు లైగర్ తరవాత అని ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ విమర్శించటం మొదలెట్టింది.
తీసేవి అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. అసలు కంటెంట్ లేని చిత్రానికి మహేష్ బాబు డేట్స్ అవసరమా.. తిరిగి మళ్లీ మహేష్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో.. అసలు ఇది ఎంతవరకు కరెక్టు అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…