రూ.4 కోట్లు పెట్టి కొన్న కోబ్రా మూవీకి.. ఎంత లాభం వచ్చిందో తెలిస్తే షాకవుతారు..

చియాన్ విక్రమ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞాన‌ముత్తు కాంబినేషన్‌లో కోబ్రా మూవీని తెరకెక్కించారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోబ్రా చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. చాలాకాలం పాటు కోబ్రా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు బుధవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న కోబ్రాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

నైజాం, సీడెడ్ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీస్ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఇటీవల కాలంలో విక్రమ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. తెలుగులో అపరిచితుడు మూవీ నుంచి విక్రమ్ కి మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాకి దాదాపుగా రూ.4 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కోబ్రా విడుదలైన రోజు వినాయక చవితి కావడంతో అది మూవీకి ప్లస్ అని చెప్పవచ్చు. మొదటి రోజు తెలుగు మరియు తమిళ్ వెర్షన్స్ లో దుమ్మురేపే కలెక్షన్స్ వచ్చాయి.

టాలీవుడ్ లో ఒక పక్క పవన్ కళ్యాణ్ జల్సా మరియు తమ్ముడు సినిమాల రీ రిలీజ్ మానియాను తట్టుకొని కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది అంటే మాములు విషయం కాదు. మొదటి రోజే ఈ సినిమా తెలుగు వర్షన్ లో 2 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను సాధించింది. అంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని మొదటి రోజే 50 శాతం రీచ్ అయిపోయింది అన్నమాట. మూవీ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా వీక్ డేస్ లో మరిన్ని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతే కచ్చితంగా ఫుల్ రన్ రూ.2 నుంచి 3 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఏదిఏమైనా చాన్నాళ్ల తర్వాత కోబ్రాతో విక్రమ్ కి సాలిడ్ హిట్ పడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM