పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. పవర్ స్టార్ కి కూడా అన్ని అప్పులున్నాయా..?

రూ.1000 సంపాదిస్తే కాలర్ ఎగరేస్తాం. పది మంది కూడా వస్తే మన అంత గొప్ప లీడర్ లేడని ఫీల్ అయిపోతాం. ఒక సక్సెస్ వస్తే.. కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టి.. కళ్ళు నెత్తి మీద పెడతాం. అదే ఫెయిల్యూర్ వస్తే కళ్ల‌ నుండి కన్నీళ్లకి ఆనకట్టలు తెంపేస్తాం. ఒకడు సాయం చేస్తాను అంటే ఎదురు చూస్తాం. ఒకడికి సాయం చేయాలంటే దూరంగా ఉంటాం. అలాంటిది ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా.. ఎన్ని విజయాలు చూసినా, మరెన్ని పరాజయాలు పలకరించినా. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో.. చెక్కు చెదరని గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంటూ అభిమానుల అభినందనలు, బర్త్ డే విషెస్ లతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే.. టీజర్ వచ్చినప్పటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు ఫ్యాన్స్.. ఇంకా ఆయన పుట్టిన రోజుకైతే.. 100 రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈ ఏడాది ఆ ఇంటెన్స్ ఇంకా పెరిగింది. జల్సా, తమ్ముడు రీ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మోస్ట్ పాపులర్ హీరో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో చిత్రానికి రూ.50 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎవరూ ఊహించలేనంత ఉండాలి. కానీ ఇతర స్టార్ హీరోలకు ఉన్నత రేంజ్ ల్ పవన్ కళ్యాణ్ ఆస్తులు లేవని సమాచారం. పవన్ పొలిటికల్ గా జనసేన పార్టీని నడుపుతున్నారు. పార్టీ భారం కూడా ఆయనపైనే ఉంది.

పైగా కమర్షియల్ యాడ్స్ కు పవన్ దూరంగా ఉండి చాలా కాలమే అవుతుంది. టాలీవుడ్ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందట. పవన్ కళ్యాణ్ కి జూబ్లీ హిల్స్ లో ఖరీదైన ఇంటితోపాటు.. హైదరాబాద్ శివారులో 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే పవన్ కళ్యాణ్ కి 312 గ్రాముల బంగారం ఉంది. పవన్ కళ్యాణ్ బిగ్ సెలెబ్రిటీ పైగా జనసేన పార్టీ అధినేత. కాబట్టి కార్ల వాడకం ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్ద మెర్సిడెస్‌ బెంజ్ ఆర్ క్లాస్ కారు, వోల్వో ఎక్స్ సి 90, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి క్యూ7 లాంప్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ఇక తన సతీమణి అన్నా లెజినోవా వద్ద రూ.30 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. తన పెద్ద కుమారుడు అకీరా పేరుమీద రూ.1.5 కోట్లు, కుమర్తె ఆద్య పేరుపై రూ.1.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరుపై, మరో కుమార్తె పోలేనా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. పవన్ కి వస్తున్న రెమ్యునరేషన్ జనసేన పార్టీ ఖర్చులు, ఇతర రొటేషన్ కి సరిపోతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దాదాపు రూ.30 కోట్లకి పైగా అప్పు కూడా ఉన్నట్లు సమాచారం. ఇందులో విచిత్రం ఏంటంటే.. తన మిత్రుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా పవన్ రెండున్నర కోట్ల అప్పు ఉన్నారట. మరో సందర్భంలో తన వదిన సురేఖకు కూడా అప్పు ఉన్నట్లు పవన్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM