Sri Reddy : న‌ల్లి బొక్క‌ల కూర వండిన శ్రీ‌రెడ్డి.. చూస్తుంటేనే నోరూరిపోతుందిగా..!

May 19, 2022 8:21 AM

Sri Reddy : యూట్యూబ్‌లో శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య‌కాలంలో చేస్తున్న హ‌డావిడి అంతా ఇంతా కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు వివిధ ర‌కాల వంట‌ల‌ను వండుతూ అల‌రిస్తోంది. ఇప్ప‌టికే మ‌ట‌న్‌, చేప‌లు, పీత‌లు.. ఇలా భిన్న ర‌కాల వంట‌ల‌ను వండి వ‌డ్డించిన శ్రీ‌రెడ్డి లేటెస్ట్‌గా న‌ల్లి బొక్క‌ల కూర‌ను వండింది. శ్రీ‌రెడ్డి త‌న వంట‌ల వీడియోల ద్వారా ఎంతో బిజీగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆమె పోస్ట్ చేస్తున్న వంట‌ల వీడియోల‌కు భారీ ఎత్తున వ్యూస్ కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక సామాజిక అంశాల‌పై కూడా శ్రీ‌రెడ్డి స్పందిస్తుంటుంది.

ఈ మ‌ధ్యే క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి గొడ‌వ‌లో శ్రీ‌రెడ్డి శ్రీ‌కాంత్‌కే మ‌ద్ద‌తు తెలిపింది. క‌రాటే క‌ల్యాణి తోలు వలుస్తాన‌ని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె పోస్ఠ్ వైర‌ల్ అయింది. ఆ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఆమె త‌న అభిమానుల‌తో కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌టించింది. అందులో భాగంగా వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు సైతం చెప్పింది. ఇక తాజాగా న‌ల్లి బొక్క‌ల కూర‌ను వండిన శ్రీ‌రెడ్డి ఆ వీడియోను కూడా త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె ఆ కూర‌ను వండి తింటుంటే నోరూరిపోతుంద‌ని.. మాక్కూడా కావాల‌ని.. నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Sri Reddy cooked Nalli Bokka Kura
Sri Reddy

కాగా శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఓ వైపు వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేస్తూనే మ‌రోవైపు సామాజిక అంశాల‌పై కూడా స్పందిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె పెడుతున్న పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆమె బ‌య‌ట మాత్రం ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియా ద్వారానే నెటిజ‌న్ల ముందుకు వ‌స్తోంది.

https://youtu.be/tYeAo4tXPYY

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now