Sri Reddy : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు అక్టోబర్ 16న తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటూ.. ఇండస్ట్రీ పెద్దలను కలుస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ మాత్రం ఎన్నికల రోజు జరిగిన ఘటనలను బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే మా ఎన్నికల వివాదంపై నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను మా కార్యాలయం ఎదుట ఆందోళన చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని వాపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ తమకు అన్యాయం జరిగిందని రోడ్డు పైకి వచ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నారని విమర్శించింది.
మా అసోసియేషన్‌కు సేవ చేస్తామని ప్రకాష్ రాజ్ అంటున్నారు.. ఎవరు సేవ చేస్తే ఏమిటి ? మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ ఏడుపు ఎందుకు ? అని ప్రశ్నించింది. ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు వేసిన ఎత్తులు పారలేదని, వారు ఏళ్ల తరబడి కొనసాగించిన ఆధిపత్యం పోయినందుకే.. ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించింది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పరువు తీశానని గతంలో హేమ, జీవిత, నాగబాబు సహా కొందరు వ్యక్తులు తనను ఏడిపించారని, కానీ ఇప్పుడు వారే అసోసియేషన్ పరువును గంగపాలు చేస్తున్నారని విమర్శించింది.
అసోసియేషన్‌లో కమ్మ, కాపు ఫీలింగ్ వచ్చిందని, దాసరి తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సమర్థత కేవలం మోహన్ బాబుకే ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…