Sri Reddy : చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ముదురుతున్న మా ఎన్నికల వివాదం..

October 14, 2021 6:09 PM

Sri Reddy : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు అక్టోబర్ 16న త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు చేసుకుంటూ.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను క‌లుస్తుండ‌గా.. మ‌రోవైపు ప్రకాష్ రాజ్ మాత్రం ఎన్నిక‌ల రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

Sri Reddy comments on chiranjeevi and naga babu over maa elections

అయితే మా ఎన్నిక‌ల వివాదంపై న‌టి శ్రీ‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. తాను మా కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న చేసిన‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, త‌న‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేద‌ని వాపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అంద‌రూ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రోడ్డు పైకి వ‌చ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నార‌ని విమ‌ర్శించింది.

మా అసోసియేష‌న్‌కు సేవ చేస్తామ‌ని ప్ర‌కాష్ రాజ్ అంటున్నారు.. ఎవ‌రు సేవ చేస్తే ఏమిటి ? మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ ఏడుపు ఎందుకు ? అని ప్ర‌శ్నించింది. ఇక చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబులు వేసిన ఎత్తులు పార‌లేద‌ని, వారు ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగించిన ఆధిప‌త్యం పోయినందుకే.. ఈ రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆరోపించింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప‌రువు తీశాన‌ని గ‌తంలో హేమ‌, జీవిత‌, నాగ‌బాబు స‌హా కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను ఏడిపించార‌ని, కానీ ఇప్పుడు వారే అసోసియేష‌న్ ప‌రువును గంగ‌పాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించింది.

అసోసియేష‌న్‌లో క‌మ్మ‌, కాపు ఫీలింగ్ వ‌చ్చింద‌ని, దాస‌రి త‌రువాత ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త కేవ‌లం మోహ‌న్ బాబుకే ఉంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment