Sreenu Vaitla : ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ మధ్య కాలంలో చాలా డల్ అయ్యాడు. తాజాగా ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు.
వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెం కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణారావు ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త విన్న శ్రీను వైట్ల ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడికి బయల్దేరింది. శ్రీను వైట్లకు పితృవియోగం అనే బాధాకరమైన వార్త విన్న సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు.
శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2011లో దూకుడు, 2013లో బాద్‌షా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం పలకరించలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…