Sreenija : రేయ్ మోహన్ బాబు.. రారా.. నీ అంతు చూస్తా ! అంటూ.. నటి కామెంట్స్..

October 17, 2021 6:33 PM

Sreenija : మా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచు విష్ణు తన అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రోగ్రామ్ పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నటి శ్రీనిజ మాత్రం మోహన్ బాబు, నరేష్ లను విపరీతంగా తిట్టింది. రేయ్.. నీ యబ్బా అంటూ ఆమె ఆవేదనను తీర్చుకుంది. మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. నరేష్ ఇప్పటివరకు మా సంస్థలో చేసిన పనుల‌ గురించి కన్నీరు పెట్టుకుని ఆయన్ను ముండమోపి అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Sreenija fires on mohan babu and naresh

భర్త చనిపోయిన వాళ్ళను కించపరిచేలా నరేష్ మాట్లాడటం పెద్ద తప్పు అని శ్రీనిజ.. నరేష్ ను విపరీతంగా తిట్టింది. టాలీవుడ్ మూవీ అసోసియేషన్ లో ఆర్టిస్టులకు ఇప్పటివరకు ఏం భరోసా ఇచ్చారని అడిగింది. ఇప్పటికే మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉన్నారని.. అప్పుడు ఆయన ఏం చేశారని.. ఇప్పుడు మంచు విష్ణు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించింది. మా ఎలక్షన్స్ కి ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాళ్ళావేళ్ళా పడి.. పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటామని చెప్పి, మా ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాల‌ని కోరారని.. శ్రీనిజ కామెంట్స్ చేసింది.

మోహన్ బాబు, విష్ణు, నరేష్ లతో పాటు వారి ప్యానెల్ మెంబర్స్ కి సంతాప సభ పెట్టకపోతే.. తన పేరు శ్రీనిజ నాయుడే కాదంటూ ఛాలెంజ్ చేసింది. మా ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్ళారని, బ్యాలెట్ బాక్సులంటే బొమ్మలాటగా ఉందా.. రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే లాక్కెళ్ళినట్లు అనుకుంటున్నారా అంటూ శ్రీనిజ కామెంట్స్ చేసింది. ఓరేయ్ మోహన్ బాబు.. రారా అపరకాళినై వచ్చాను, ఛాలెంజ్ చేస్తున్నా.. ఆడవాళ్ళంటే గౌరవం లేదా? ఎవరైనా అడిగితే నీ అబ్బా.. అని తిడతావా.. నీ అంతు చూస్తానంటూ.. శ్రీనిజ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment