Sreeleela : అదృష్టం ఉండాలే కానీ అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. పెళ్లిసందD సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. పెళ్లిసందD సినిమా ప్లాప్ టాక్ దక్కించుకున్నా శ్రీలల మాత్రం తన పర్‌ఫార్మెన్స్‌తో అందరి మతులూ పోగొట్టింది.
హీరోయిన్ శ్రీలీల జోరు మాత్రం మామూలుగా లేదు. ఇప్పటికే రవితేజ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాతోపాటు ఒక మెగా హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా ఈమెను తీసుకునేందుకు చర్చలు జరిపారనే వార్తలు వారం రోజుల క్రితం వచ్చాయి. ఇప్పుడు నందమూరి హీరో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీలీల అంటూ వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ తో కొరటాల శివ చేయబోతున్న సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్.. కియారా అద్వానీలతోపాటు అనన్య పాండే వరకు పలువురిని పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆలియా భట్ కు భారీ పారితోషికం ఇచ్చి ఆమెను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పడు శ్రీలీల పేరు పరిశీలనకు వచ్చిందట. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రావలసి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…