Sreeleela : శ్రీలీలకు బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా ఎన్‌టీఆర్‌తో నటించే చాన్స్‌..?

October 29, 2021 11:54 PM

Sreeleela : అదృష్టం ఉండాలే కానీ అవ‌కాశాలు త‌లుపు తడుతూ ఉంటాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల‌. పెళ్లిసందD సినిమాలో ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. పెళ్లిసందD సినిమా ప్లాప్ టాక్ దక్కించుకున్నా శ్రీల‌ల మాత్రం త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అంద‌రి మ‌తులూ పోగొట్టింది.

Sreeleela reportedly getting offer to act in ntr movie

హీరోయిన్ శ్రీలీల జోరు మాత్రం మామూలుగా లేదు. ఇప్పటికే రవితేజ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాతోపాటు ఒక మెగా హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా ఈమెను తీసుకునేందుకు చర్చలు జరిపారనే వార్తలు వారం రోజుల క్రితం వచ్చాయి. ఇప్పుడు నందమూరి హీరో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీలీల అంటూ వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ తో కొరటాల శివ చేయబోతున్న సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్.. కియారా అద్వానీలతోపాటు అనన్య పాండే వరకు పలువురిని పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆలియా భట్ కు భారీ పారితోషికం ఇచ్చి ఆమెను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పడు శ్రీలీల పేరు పరిశీలనకు వచ్చిందట. మ‌రోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now