Sreeja : వాట్సాప్ చాట్‌ను బ‌య‌ట పెట్టేసిన శ్రీ‌జ‌.. అందులో ఏముంది..?

July 17, 2022 8:52 PM

Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్య కాలంలో త‌న కుమార్తెల‌కు చెందిన ఫొటోల‌ను ఎక్కువ‌గా షేర్ చేస్తోంది. గ‌తంలో క‌ల్యాణ్ దేవ్‌తో క‌లిసి ప్ర‌తి పోస్టులోనూ ఈమె క‌నిపించేది. కానీ చాలా రోజులుగా వీరు వేర్వేరుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ ఇద్ద‌రూ విడిపోయార‌ని.. త్వ‌ర‌లోనే విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు క‌ల్యాణ్ దేవ్ సినిమాల‌ను గతంలో మెగా ఫ్యామిలీ ప్ర‌మోట్ చేసింది. కానీ ఇప్పుడు ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో క‌ల్యాణ్ దేవ్ నటించిన సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర సాని అనే మూవీలు రిలీజ్ అయిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు.

ఇక తాజాగా శ్రీ‌జ ఓ వాట్సాప్ చాట్‌ను బ‌య‌ట పెట్టింది. అందులో త‌న కుమార్తె నివృత్తితో ఆమె చాటింగ్ చేసింది. ఆమె త‌న త‌ల్లి శ్రీ‌జ‌కు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టగా.. దానికి శ్రీ‌జ న‌వ్వుతూ రిప్లై ఇచ్చింది. అయితే ఆ ఎమోజీ త‌నకు న‌చ్చ‌లేద‌ని నివృత్తి చెప్ప‌గా.. మేం పాత కాలం మ‌నుషులం ఇంతే.. అని శ్రీ‌జ రిప్లై ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ వాట్సాప్ చాట్‌ను శ్రీ‌జ త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అది సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Sreeja shared her whatsapp chat with her daughter
Sreeja

అయితే గ‌త కొంత కాలంగా శ్రీ‌జ త‌న కుమార్తెలు నివృత్తి, న‌విష్క‌ల‌ను త‌న వ‌ద్దే పెంచుతోంది. ఈ మధ్యే న‌విష్క బ‌ర్త్ డే కు కల్యాణ్ దేవ్ విషెస్ చెప్పాడు. కానీ నివృత్తి బ‌ర్త్ డేకు చెప్ప‌లేదు. దీంతో శ్రీ‌జ‌, క‌ల్యాణ్ మ‌ధ్య ఏదో జ‌రిగి ఉంటుంద‌ని.. క‌నుక‌నే వారు విడిగా ఉంటున్నార‌ని అంటున్నారు. అయితే వీరు విడిగా ఉంటున్నారా.. లేక ఇప్ప‌టికే విడాకులు తీసుకుంటున్నారా.. అన్న విష‌యాల‌ను మాత్రం స్ప‌ష్టం చేయలేదు. కానీ దీనిపై త్వ‌ర‌లో ఏమైనా విష‌యాలు తెలుస్తాయేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now